top of page
Suresh D

వామ్మో ఈ సైకో మళ్లీ వచ్చాడు.. వణుకు పుట్టించేలా సైంధవ్ ట్రైలర్🎥🎉

ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా వెంకటేశ్ కు 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది. ఇక సంక్రాంతికి వెంకటేష్ హిట్ ఖాయమని తెలుస్తోంది. 🎥🎉


bottom of page