సాయిపల్లవికి తెలుగు తమిళ మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఏ భాషలోనైనా తనకు నచ్చిన కథలను పాత్రలను చేయడమే సాయిపల్లవికి అలవాటు. తనకు కథ నచ్చితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది .. నచ్చే కథ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది.
సాయిపల్లవికి తెలుగు తమిళ మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఏ భాషలోనైనా తనకు నచ్చిన కథలను పాత్రలను చేయడమే సాయిపల్లవికి అలవాటు. తనకు కథ నచ్చితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది .. నచ్చే కథ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. అందువల్ల సహజంగానే కాస్త గ్యాప్ వస్తూ ఉంటుంది. తెలుగులో 'విరాటపర్వం' తరువాత ఆమెకు అలాంటి గ్యాప్ వచ్చింది. తెలుగు నుంచి సాయిపల్లవికి నచ్చిన కథ వెళ్లకపోవడంతో, ఆమె తమిళంలో ఒక సినిమా చేస్తోంది. శివ కార్తికేయన్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా దర్శకుడు సునీల్ పాండే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సాయిపల్లవికి ఇది ఫస్టు బాలీవుడ్ సినిమా అవుతుంది. సాయిపల్లవి నటనకి డాన్స్ కి అక్కడి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.🎥🌟