top of page
Suresh D

ఐటం సాంగ్‌లో సాయి పల్లవి ✨

చేసింది తక్కువ సినిమాలే అయిన సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి తన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి పల్లవి కాలేజ్ చదువుకునే రోజుల్లో డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన డ్యాన్స్‌తో యూత్‌ను ఉర్రుతలుగించిన 'షీలా కీ జవానీ సాంగ్'కు సాయిపల్లవి ఊర మాస్ డాన్స్ చేసింది. సాయి పల్లవి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఎలాంటి కఠినమైన స్టెప్ అయినా అలవోకగా చేసే సాయిపల్లవి టాలెంట్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


bottom of page