సాయి పల్లవి.. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తెలుగులో సాయి పల్లవికి సపరేట్ క్రేజ్ ఉంది. ఆమెను టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు.
టాలీవుడ్లో సాయిపల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. సాయి పల్లవి పద్దతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తూ దూసుకుపోతుంది. అయితే సాయి పల్లవిని సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
అయితే సాయి పల్లవి ఇంతవరకు ఎలాంటి యాడ్స్ లో నటించలేదు. అయితే ఓ యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ చేశారట. కానీ సాయి పల్లవి మాత్రం సున్నితంగా నో చెప్పిందట.
ఓ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు సాయి పల్లవితో యాడ్ షూట్ చెయ్యాలని అనుకున్నారట. ఇందుకోసం ఆమెకు రూ. 2 కోట్లు ఆఫర్ చేశారట. చర్మం రంగుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఆ యాడ్ స్కు నో చెప్పిందట సాయి పల్లవి.