top of page

ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్న శ్రుతి హాసన్..🎥🎞️

హిందీతో పాటు దక్షిణాది భాషల్లో బిజీగా ఉన్న శ్రుతి హాసన్ టాలీవుడ్ లో ఈ మధ్య వాల్తేరు వీరయ్య , వీరసింహరెడ్డి చిత్రాలతో అలరించింది. ఆమె ప్రభాస్ సరసన నటించిన ప్యాన్ ఇండియా చిత్రం 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది.

హిందీతో పాటు దక్షిణాది భాషల్లో బిజీగా ఉన్న శ్రుతి హాసన్ టాలీవుడ్ లో ఈ మధ్య వాల్తేరు వీరయ్య , వీరసింహరెడ్డి చిత్రాలతో అలరించింది. ఆమె ప్రభాస్ సరసన నటించిన ప్యాన్ ఇండియా చిత్రం 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.🎥🎞️

ఈ సినిమా నుంచి శ్రుతికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఇందులో తన పాత్రకు శ్రుతినే డబ్బింగ్ చెబుతోంది. ఇందులో కొత్తేమిటంటారా? ఉంది. ఐదు భాషల్లో వస్తున్న ఈ చిత్రంలో అన్నింటికి శ్రుతి డబ్బింగ్ చెబుతోంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. మరో రెండింటివి కూడా పూర్తి చేసే పనిలో ఉంది. సాధారణంగా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకునేందుకు హీరోయిన్లు వెనుకాడుతారు. కానీ, శ్రుతి ఏకంగా ఐదు భాషల్లో సొంత గొంతు వినిపించే సాహసం చేయనుంది.🎥🎞️


 
 
bottom of page