top of page
Suresh D

సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్.. అదిరిపోయిన రెస్పాన్స్ 🎉

ప్రభాస్ సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చెప్పినట్లే మేకర్స్ శుక్రవారం (డిసెంబర్ 15) సాయంత్రం నుంచి కర్ణాటక, కేరళల్లో బుకింగ్స్ ప్రారంభించారు.

సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు మేకర్స్. కర్ణాటక, కేరళల్లోని లిమిటెడ్ స్క్రీన్లకు ఈ బుకింగ్స్ ప్రారంభమైనట్లు హోంబలె ఫిల్మ్స్ వెల్లడించింది. శుక్రవారం (డిసెంబర్ 15) సాయంత్రం 6.49 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఉదయమే సోషల్ మీడియా ఎక్స్ ద్వారా హోంబలె ఫిల్మ్స్ తెలిపింది.

బెంగళూరులో సలార్ మూవీ షోలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. 2 గంటల 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా రోజుకు ఆరు షోలు ఉండటం మరో విశేషం. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని కూడా మేకర్స్ వెల్లడించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఉదయం 5 గంటల షోల టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి.

45 షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. తొలి 40 నిమిషాల్లోనే 9 షోలు హౌజ్‌ఫుల్ కాగా.. 8 వేల టికెట్లు అమ్ముడైనట్లు బాక్సాఫీస్ ట్రాకర్స్ తెలిపాయి. బెంగళూరులో సలార్ తెలుగు వెర్షన్ టికెట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల బుకింగ్స్ ప్రారంభం కాగా.. మల్టీప్లెక్స్ బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతానికి కర్ణాటక, కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. కర్ణాటకలోనే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు బ్రేకవడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగళూరులో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ల ధరలు కూడా భారీగా పెంచేశారు. ఈ టికెట్ల ధరలు రూ.600 వరకూ ఉన్నాయి.

సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంతకుముందు రోజే షారుక్ ఖాన్ డంకీ రానుంది. దేవ (ప్రభాస్) వరదరాజ (పృథ్వీరాజ్) మధ్య స్నేహం, శతృత్వం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. 🎥✨

bottom of page