హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ''హనీ, బన్నీ'' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడిగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత ఆమెపై చాలానే రుమార్స్ తెర మీదకు వచ్చాయి. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్‌లో ఉందని..వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్దార్ధ్‌ను ప్రేమించిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్దార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫొటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో సిద్దార్థ్‌కు బ్రేకప్ చెప్పి..నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరి కంటే ముందే సమంతను ఓ పొలిషియన్ కుమారుడు ప్రేమించాడట. సమంతను సైతం తిరిగి తనని ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. అతని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చిసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.