నటి సమంత రూత్ ప్రభు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తన పని తాను చేసుకుంటుంది సామ్. మాయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత సమంత షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. త్వరలోనే తిరిగి షూటింగ్స్ తో బిజీ కావాలని చూస్తుంది. అయితే సామ్ సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది సామ్. అయితే ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేసి, దానిని డిలీట్ చేసిందని కొందరు వార్తలను ప్రచారం చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. సమంత అర్ధ నగ్నంగా ఉన్న ఫోటో వైరల్‌గా అవుతుంది. ఈ ఘటనపై సమంత పరోక్షంగా స్పందించింది. ఇలాంటి ఘటనలపై తన స్పందన ఏమిటో ఇన్ డైరెక్ట్ గా చెప్పింది సామ్. తన ఇన్ స్టార్ స్టోరీలో టవల్ తో ఓ ఫోటో షేర్ చేసింది సామ్.. దాంతో మరో ఫోటో మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్ ఫోటోను కొందరు కేటుగాళ్లు అది సమంత ఫోటో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ ఫోటోను కూడా సామ్ తన స్టోరీలో పెట్టి డిలీట్ చేసిందంటూ వార్తలు పుట్టించారు. ఆ తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ కోట్ షేర్ చేసింది. ఇది ‘మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే నిజమైన విజయం’ అనే కోట్ షేర్ చేసింది సామ్. దాంతో తాను ఇలాంటి వాటిపై స్పందించబోనని, క్లారిటీ ఇవ్వనని పరోక్షంగా చెప్పింది.
సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. అలాగే పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కొత్త సినిమాలను లైనప్ చేస్తుంది సామ్. వరుణ్ ధావన్‌తో సమంత నటించిన ‘హనీ బాని’ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.