సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరమండి: ది డైమండ్ బజార్’ సిరీస్ మే 1న ఓటీటీలోకి వచ్చింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ OTT లో అందుబాటులో ఉంది ఈ వెబ్ సిరీస్. లాహోర్‌లోని రెడ్ లైట్ ఏరియా అయిన హీరామండి కథ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు సంజయ్ లీల బన్సాలీ. బ్రిటీష్ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది ఆర్టిస్ట్ లు ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం ఒకొక్కరు భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారట.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు సంజయ్ లీలా బన్సాలీ 65 కోట్లు అందుకున్నారని తెలుస్తోంది. మొత్తం సిరీస్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి బన్సాలీ. ఇప్పుడు ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో నటించిన నటీమణుల విషయానికి వస్తే, సోనాక్షి సిన్హా అత్యధిక పారితోషికం అందుకుంది. ఆమె రూ.2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుందట. అలాగే అదితి రావ్ హైదరి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె దాదాపు 1-1.5 కోట్ల రూపాయలు తీసుకుందట. సోనాక్షి సిన్హా తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి అదితి రావ్ హైదరీ. ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది ఈ చిన్నది.
మనీషా కోయిరాలా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఈ సిరీస్‌లో రిచా చద్దా రజ్జో పాత్రను పోషించింది మనీషా. ఇందుకోసం కోటి రూపాయల అందుకుందట. సంజీదా శేఖర్ 40 లక్షల రూపాయలు అందుకున్నట్లు టాక్. ఆమె పాత్ర ఎక్కువ సమయం తెరపై కనిపించదు. సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లోని సెట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అదే విధంగా విలాసవంతమైన ఇంటి సెట్ ను ఈ సిరీస్ కోసం తయారు చేశారు. ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంజయ్ తొలిసారిగా ఓ సిరీస్ చేయడం విశేషం