top of page
Suresh D

'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ🎥🌟

​​రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో'. సెప్టెంబర్ 1న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. 'అతడే శ్రీమన్నారాయణ', 'చార్లీ' చిత్రాలు తెలుగులోనూ కొంత మందిని ఆకట్టుకున్నాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో'. సెప్టెంబర్ 1న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు.

హృదయానికి హత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరో హీరోయిన్ల నటన, తెరపై ప్రపంచంలోకి తీసుకువెళ్లే సన్నివేశాల కలబోత 'సప్త సాగరాలు దాటి' సినిమా. తెరపై పాత్రలతో మనమూ ప్రయాణించేలా దర్శకుడు సినిమా తీశారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ భావోద్వేగాలు మనల్ని వెంటాడుతాయి. అయితే... ఎమోషన్స్ ఇన్ డెప్త్ చూపించడంతో కొందరికి చాలా నిదానంగా సాగుతున్న ఫీలింగ్ కలగవచ్చు.

'సప్త సాగరాలు దాటి'లో మనం చూసింది సగం సినిమాయే. అక్టోబర్ 27న మిగతా సగం చూడాలి. ఈ సినిమా చివర్లో చూపించిన రెండు మూడు నిమిషాల దృశ్యాలు మిగతా సగంపై అంచనాలను విపరీతంగా పెంచుతుంది. అందులో మరో సందేహం లేదు. 🎥🌟


bottom of page