టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయాజీ షిండే. ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు, సహయ నటుడిగా కనిపించి మెప్పించాడు.
చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సాయాజీ షిండే నిన్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గురువారం ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు.
కొన్ని రోజుల క్రితం సాయాజీ షిండేకు ఛాతిలో నొప్పి వచ్చిందని.. దీంతో వెంటనే ఆసుపత్రికి వచ్చి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకున్నారని అన్నారు వైద్యులు. ఈసీజీ టెస్ట్ చేగా.. అతడి 2D ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు.. గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ తర్వాత నిన్న మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని.. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.🎥