వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలను చేపట్టింది. అటువంటి ప్రాజెక్ట్‌ల గురించిన తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన: 🌾 భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రూ.2000 చొప్పున అందిస్తోంది.
పంటల బీమా పథకం: 🌱 ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా పంట నష్టపోయిన సమయంలో బీమా అందిచే విధంగా ఈ పథకాన్ని రూపొందించింది కేంద్రం.
పీఎం కిసాన్ నీటి పారుదల స్కీమ్: 🚜 సాగు నీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజనను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రతి పొలానికి నీరు అందిచాలి. దీని కింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు, బోర్డు, ఫీల్డ్ అప్లికేషన్, డెవలప్‌మెంట్ పద్ధతులపై ఎండ్ టు ఎండ్ మేనేజ్‌మెంట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్రెడిట్ కార్డ్: 💳 కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు రుణ సౌకర్యం అందిస్తోంది. ఈ రుణాన్ని రైతులు పంటల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్: 🤝 దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్‌పిఓల ద్వారా రైతులను ఆర్థికంగా, మార్కెట్‌లో ఈ పథకం ద్వారా బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందులో రైతులు పలు ప్రయోజనాలు పొందవచ్చు.
డ్రోన్ల వినియోగం: 🚁 వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగంలో పెద్ద మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు.
తేనెటీగల పెంపకం పథకం: 🐝 రాష్ట్రీయ గోకుల్ పథకం, నీలి విప్లవం, వడ్డీ రాయితీ పథకం, ఆగ్రోఫారెస్ట్రీ, వెదురు అటవీ నిర్మూలన పథకం, వాటర్‌షెడ్ అభివృద్ధి పథకం మొదలైనవి ఉన్నాయి.
పీఎం కిసాన్ మాన్ ధన్: 💰 ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఇది పెన్షన్ పథకం అని చెప్పుకోవచ్చు. రైతులు ఇందులో చేరొచ్చు. 2019లో ఈ పథకం అమలులోకి వచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. గరిష్టంగా రూ. 3 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది.
వడ్డీ రాయితీ స్కీమ్: 🌿 కేంద్రం ఈ పథకాన్ని 2022 ఆగస్ట్ నెలలో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటులో 1.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే కచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అంటే వడ్డీ కట్టి, మళ్లీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి.