top of page
Shiva YT

🏛️🔥 పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. సభలోకి దూసుకొచ్చి గ్యాస్‌..

📅 పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తైన సమయంలో లోక్‌సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉల్లంఘిస్తూ దారుణానికి ఒడిగట్టారు. 🚨

లోక్‌సభలో జీరో ఆవర్‌ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు ఆగంతకులు సందర్శకులు కూర్చొనే గ్యాలరీ నుండి దూకి సభలోకి ప్రవేశించారు. గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్ క్యానిస్టర్‌లను విసిరారు. సభ్యులు కూర్చునే టేబుల్స్‌పై నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఖంగుతిన్న ఎంపీలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాలుగు వైపుల నుంచి వారిని చుట్టుముట్టి బంధించారు.


ఈ క్రమంలో ఆ ఆగంతకులు తమ షూస్‌ బయటకు తీశారని, దాన్నుంచి ఒక్కసారిగా పసుపు రంగు పొగ వచ్చిందని ఎంపీలు తెలిపారు. ఆ పొగ సభంతా నిండిపోయిందని సభ్యులు తెలిపారు. ఈ కలకలం మధ్య సభను సభాపతి వాయిదా వేశారు.🚔

లోక్‌సభలోకి వచ్చిన ఆగంతకులను భద్రతా సిబ్బంది బంధించారు. ఇది అందరి వయస్సు 35 సంవత్సరాల లోపు ఉంటుందని ఎంపీలు తెలిపారు. ఈ ఇద్దరు అర్థం కానీ రీతిలో నినాదాలు చేశారని, గందరగోళం మధ్య అవి వినిపించలేదని వెల్లడించారు. వారిలో ఒకరి పేరు సాగర్‌ అని కొంత మంది ఎంపీలు తెలిపారు. అతను మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా గెస్ట్‌గా పాస్‌ తీసుకున్నారని అన్నారు.🚶‍♂️

2001 పార్లమెంటు దాడి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం లోక్‌సభ లోపల ఒక పెద్ద భద్రతా ఉల్లంఘనలో, 🤼 ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్ క్యానిస్టర్‌లను విసిరారు. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారని ఎంపీలు తెలిపారు.👊

సభలో భద్రతా లోపంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. జీరో అవర్‌లో జరిగిన ఘటనపై లోక్‌సభ తన స్థాయిలో సమగ్ర విచారణ జరుపుతోందన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు అవసరమైన సూచనలు కూడా ఇచ్చారు.🚷 ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇది సాధారణ పొగ మాత్రమే, కాబట్టి ఈ పొగ ఆందోళన కలిగించే విషయం కాదన్నా స్పీకర్ ఓం బిర్లా.



bottom of page