గిరిజనుడి పై మూత్రం పోస్తే ఈ సీఎం ఏం చేశాడో చూడండి..
- Shiva YT
- Jul 7, 2023
- 1 min read
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ బీజేపీ(BJP) నాయకుడు ప్రవేశ్ శుక్లా (Pravesh Shukla)మానసిక పరిస్థితి సరిగాలేని ఓ గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసి అవమానించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే సమాజంలో అణగారిన వర్గాలను అవమానపరిచే విధంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేయించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్..నిందితుడు ఆక్రమించుకున్న ఇంటిని కూడా కూల్చివేయాలని ఆదేశించారు. ఇదంతా నేరం చేసిన వ్యక్తి ఏ పార్టీ అయినా సరే తమ ప్రభుత్వం విధించే శిక్ష ఇంతే కఠినంగా వ్యవహరిస్తుందని నిరూపించారు. దీంతో పాటు ఆయన తన గొప్పతనాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుడు దశమత్‌రావత్(Dashmat Rawat)ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)కలిశారు. అతడ్ని భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అంతటితో ఆగకుండా పళ్లెంలో అతని కాళ్లు పెట్టి కడిగారు ముఖ్యమంత్రి.