top of page
Suresh D

కథలు కాపీ కొట్టను..అందుకే చాలా స్లో : శేఖర్ కమ్ముల


శేఖర్ కమ్ముల సినిమా అంటే అందరికీ ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ కలుగుతుంది. ఆయన సినిమాలు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనసును తాకేలా ఉంటాయి. ఓ హ్యాపీ డేస్ తీసుకున్నా.. ఓ ఫిదా తీసుకున్నా.. ఓ లీడర్ తీసుకున్నా.. అవన్నీ మన జీవితాల్లో ఓ భాగమే అన్నట్టుగా సాగుతుంటాయి. ఇక ఆనంద్, గోదావరి వంటి చిత్రాలు ఎప్పుడూ ఓ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. 24 కెరీర్‌లో కొన్ని సినిమాలే చేసినా కూడా అన్నీ మంచి చిత్రాలు తీసిన ఘనత ఆయనది. 2000లో కెరీర్ మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల ఇక 25 ఏటలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ గురించి..ఆయన మాటల్లోనే..

హ్యాపీడేస్ సినిమా ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ఇన్నేళ్ళు అయినా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలనిపిస్తుంది.. అలానే మళ్లీ మళ్ళీ ఆ సినిమా చూడాలి అనిపించేలా ఉంటుందన్నాడు. అందులో సంగీతం కూడా అంత బాగుంటుందన్నాడు. ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మరలా చూశానని, చాలా ఫ్రెష్‌గా ఉందని, రీరిలీజ్ కూడా యూత్ కు ఓ పండుగలా వుంటుందన్నాడు. హ్యాపీడేస్ సీక్వెల్ అనుకున్నాను కానీ, కథ సెట్ అవ్వడం లేదన్నాడు.

ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే తన పట్ల తనకు చాలా గర్వంగా ఉంటుందన్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. తాను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్‌లోనే వెళ్తానని అన్నాడు. తాను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదని, అలా అని సినిమాలూ తీయలేదని అదే తనకు గర్వంగా అనిపిస్తుందన్నాడు.

కెరీర్ స్లో అనే కామెంట్ల మీద స్పందిస్తూ.. తనకు ఎప్పుడూ అలా అనిపించలేదన్నాడు. తాను సినిమా చేసే పద్దతి, తన సినిమాలే తన గురించి మాట్లాడతాయని తెలిపాడు. కాపీ కొట్టి కథలు తాను చేయనని, కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటానన్నాడు. మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని, ఆలోచన వచ్చాక.. మేకింగ్ పరంగా ఫాస్ట్‌గా ఉంటానని చెప్పుకొచ్చాడు. థింకింగ్ పరంగా మాత్రం స్లోగా ఉంటానని తెలిపాడు.


bottom of page