గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది.
రెండు రోజుల వ్యవధిలోనేప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ, తెలుగు నటుడు, కమెడియన్ గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మంగళవారం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు చెన్నైలోని సిరుచ్చేరిలోని తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సిరుశేరిలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.🎥