తాజాగా ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.మాలీవుడ్ బ్యూటీ మీరా జాస్మిన్ ఈ పేరు కొత్తగా పరిచయం అక్కరలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించి ‘గుడుంబ శంకర్’ మూవీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన మీరా జాస్మిస్ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య మళ్లీ రీ ఎంట్రీకి ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఇటీవల సముద్ర ఖని, యాంకర్ అనసూయ నటించిన ‘విమానం’ మూవీలో గెస్ట్ రోల్ లో నటించింది. తాజాగా మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. జోసెఫ్ ఫలిప్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నాడు. జోసెఫ్ ఫిలిప్ కి భార్య ఎలియమ్మ జోసెఫ్ , పిల్లలు జిబి సారా జోసెఫ్, జెని సారా జోసెఫ్, జార్జ్, జాయ్ ఉన్నారు. మీరా జాస్మిన్ నాల్గవ కూతురు.మీరా జాస్మిన్ ఇంట విషాదం నిండటంతో పలువురు సెలబ్రెటీలు ఆమె తండ్రికి నివాళులర్పించారు.🎥