తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు అడ్డు తొలిగింది. మొన్నటి వరకూ కోర్టులో ఉన్న వివాదానికి తెలంగాణ హైకోర్ట్ తెరదించింది. ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో త్వరలోనే 15 వేల 640 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి.
తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు అడ్డు తొలిగింది. మొన్నటి వరకూ కోర్టులో ఉన్న వివాదానికి తెలంగాణ హైకోర్ట్ తెరదించింది. ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో త్వరలోనే 15 వేల 640 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం వాళ్లకు సానుకూలంగా తీర్పునిచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 మార్కులు కలపాలంటూ ఆదేశించింది.
అయితే ఈ తీర్పుపై ఎంపికైన కొందరు అభ్యర్థులు తప్పుబట్టారు. సింగిల్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ స్వీకరించింది. ఇన్నాళ్లు ఈ వ్యవహారం హైకోర్టులో ఉండటంతో నియామకాలకు అప్పట్లో బ్రేక్ పడింది. ఈ పిటిషన్‌ను ఇప్పుడు విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పును తప్పుబట్టింది. మార్కులు కలపాల్సిన అవసరం లేదంటూ చెప్పింది. పరీక్షల్లో తప్పులు దొర్లాయన్న విషయంలో ఎక్స్‌పర్ట్ కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించింది.
దీనికోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు కానుంది. విచారణ పూర్తయ్యాక 4 వారాల్లో ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోల్డ్‌లో ఉన్న ఉద్యోగాలన్నీ ఇప్పుడు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్ట్ తీర్పుపై కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆనందంలో మునిగిపోతున్నారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.🎉👩⚖️