top of page

ఎన్నికలలో ఆధిక్యంలో సెక్స్ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ


ఆధిక్యంలో కొనసాగుతున్న సెక్స్ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ ఎన్నికల ఫలితాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. హసన్ నుంచి బరిలోకి దిగిన ప్రజ్వల్ తన సమీప ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోయిన ఆయనను వెనక్కి రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేశారు. చివరికి ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరికలతో గతవారం బెంగళూరు చేరుకున్న ప్రజ్వల్‌ను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

 
 
bottom of page