ప్రధాని మోదీకి షారుఖ్ అభినందనలు..🎥🌟
- Suresh D
- Sep 11, 2023
- 1 min read
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 దేశాల సదస్సుపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పందించారు. సదస్సును విజయవంతం చేశారని ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. జీ20 సదస్సుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో మోదీకి కంగ్రాట్స్ చెప్పారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోందని షారుఖ్ ఖాన్ అన్నారు.జీ20 సదస్సుకు నాయకత్వం వహించడం, దేశాల మధ్య ఐక్యత కోసం పాటుపడడం దేశానికి గర్వకారణమని అన్నారు. ‘మోదీ సర్.. మీ నాయకత్వంలో దేశంలో ఐకమత్యం వెల్లివిరిస్తుంది. ఒకే దేశం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుగా ముందుకు వెళుతుంది’ అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.🎥🌟
