బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్యన్ నటి, మోడల్ లారిస్సా బొనేసితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయిఅయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందోకానీ.. తరచుగా ఖాన్ కుటుంబంతో సమయం గడపడమే కాకుండా ఆమె ఆర్యన్‌తో చాలాసార్లు కనిపించింది. ఆర్యన్ ఆమెకు జాకెట్‌ను కూడా బహుమతిగా ఇచ్చాడు. దీని తర్వాత ఇద్దరి డేటింగ్ గురించి వార్తలొచ్చాయి. కింగ్ ఖాన్ కొడుకుతో సంబంధం ఉన్న లారిస్సా ఎవరు అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.లారిసా ఒక బ్రెజిలియన్ మోడల్. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలతో బ్లాక్ బస్టర్ పాట "సుబా హోనే నా దే"తో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. టైగర్ ష్రాఫ్, సూరజ్ పంచోలితో కొన్ని మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లు కూడా చేసింది.ఆమె మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి నటి కూడా. లారిస్సా తెలుగులో 'తిక్క' సినిమాలో నటించింది. ఇక ఆమె బాలీవుడ్‌లో సైఫ్ అలీ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం ఆర్యన్ ఖాన్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ కావడంతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ లో వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. లారిస్సా ప్రస్తుతం ముంబైలోనే ఉంటూ పలు ఫంక్షన్లలో మెరుస్తోంది.