ఇక షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఆయన రాబోయే చిత్రం ‘డుంకీ’ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను తాజాగా షారుఖ్ ఖాన్ కొట్టిపారేశారు.
ఇక షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఆయన రాబోయే చిత్రం ‘డుంకీ’ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను తాజాగా షారుఖ్ ఖాన్ కొట్టిపారేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా(డిసెంబర్ 22) విడుదల కానున్నట్లు తెలిపారు. ఇటీవల, ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ‘జవాన్’ సక్సెస్ మీట్‌లో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ విడుదల తేదీని మరోసారి కన్ఫామ్ చేశారు. “మేము జనవరి 26న ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ‘జవాన్’ జన్మాష్టమికి విడుదలైంది. క్రిస్మస్ కానుకగా ‘డుంకీ’ విడుదల అవుతుంది” అని షారుఖ్ తెలిపారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్నది. సంజయ్ దత్ సహా పలువురు నటీనటులు ఈ మూవీలో కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ చిత్రంతో షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయంగా భావిస్తున్నారు ఆయన అభిమానులు.🎥🌟