top of page
Suresh D

4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా..🌟💰🎥

షారుక్ ఖాన్ హీరోగా 'జవాన్' సినిమా తెరకెక్కింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు. షారుక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, దీపికా పదుకొణె - నయనతార కీలకమైన పాత్రలను పోషించారు. సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన థియేటర్లకు వచ్చింది.తొలి రోజున ఈ సినిమా 129.6 కోట్లను .. రెండో రోజున 240.47 కోట్లను .. మూడో రోజున 384.69 కోట్లను .. నాలుగో రోజున 520.79 కోట్లను వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం. దాంతో షారుక్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 💰🎥


bottom of page