top of page
Shiva YT

ఓటీటీలోకి షారుఖ్ ఖాన్ డంకీ..🎥🔥

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మొన్నటి వరకు వరుస ఫ్లాప్స్ తో సతమతం అయ్యారు. ఇక గత ఏడాది మూడు సినిమాలతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ కొట్టారు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్నారు. ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘పఠాన్’ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ‘జవాన్’ సినిమా కూడా ఇదే బజ్‌ని అందుకున్నింది. ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 21న ‘డుంకీ’ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాలతో పోలిస్తే ‘డంకీ’ని థియేటర్లలో చూసిన వారి సంఖ్య తక్కువే. ఈ సినిమాను ఓటీటీలో చూస్తే చాలు అనుకునే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ‘డుంకీ’ సినిమా OTT విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు 🍿📺.

‘డంకీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 16న ‘డ‌ంకీ’ సినిమా ఓటీటీకి వ‌స్తుంద‌ని అంటున్నారు. ‘జియో సినిమా’ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్రబృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ‘డంకీ’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ తదితరులు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ‘డంకీ’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా పెద్దగా సందడి చేయలేదు. అయితే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 212 కోట్ల రూపాయలు వసూలు చేసింది 🎬💰.

bottom of page