మెగా అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తున్నారు దర్శకుడు శంకర్. ఆయన కష్టాల్లో ఉన్న టైమ్‌లో భారీ ప్రాజెక్ట్ ఇచ్చి ఆదుకున్న హీరో, నిర్మాతకు శంకర్ చుక్కలు చూపిస్తున్నారని కంప్లయింట్ చేశారు. ఇంతకీ శంకర్ మీద అభిమానులు ఎందుకు ఫైర్ అవుతున్నారు.?
ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.
దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అభిమానులు ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే శంకర్ మాత్రం చాలా తాపీగా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని చెప్పారు.
పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న శంకర్, ఆ వర్క్ ఇండియన్ 2 రిలీజ్, ప్రమోషన్ వర్క్ అంతా అయ్యాకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజులుగా గేమ్ చేంజర్‌ను పక్కన పెట్టి పూర్తిగా ఇండియన్ 2 వర్క్‌లోనే ఉన్నారు శంకర్.
గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత రీస్టార్ట్ అయిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. పుటేజ్ ఎక్కవు రావటంతో ఇండియన్ 3ని కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఆ సినిమాకు సంబంధించి ఇంత వేగంగా అప్‌డేట్స్ వస్తున్నారు.
గేమ్ చేంజర్ విషయంలో మాత్రం షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా క్లారిటీ రావటం లేదు. లేటెస్ట్ స్టేట్మెంట్‌లోనూ త్వరలో రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని చెప్పిన శంకర్.. అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు.
అది కూడా ఇండియన్ 2 వర్క్ అంతా అయ్యాకా.. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చెక్ చేసి, ఆ తరువాతే రిలీజ్ డేట్ మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో శంకర్ ప్లానింగ్ మీద గట్టిగానే ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.