ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ సినిమా పుష్ప2 ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. పుష్ప మొదటి భాగం హిందీ బెల్ట్ లో భారీ హిట్ అవడంతోపాటు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. గతేడాది ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఆరోజు సెలవుదినం కావడంతోపాటు తర్వాత కూడా సెలవులు ఉండటంతో కలిసివస్తుందని భావించారు.
తాజాగా ఈ చిత్రానికి పోటీగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2 విడుదల చేయనున్నారు. వాస్తవానికి జూన్ లో విడుదల చేయాలనుకున్నప్పుప్పటికీ గ్రాఫిక్ వర్క్స్ పూర్తికాకపోవడంతో ఆగస్టు 15నే విడుదల చేయాలని శంకర్ నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉండే కథాంశంతో తీసే సినిమా కాబట్టి ఆగస్టు 15 తేదీ బాగుంటుందని ఆయన భావిస్తున్నారు.
అయితే దేశవ్యాప్తంగా పుష్ప2కు భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాక పోటీగా అదేరోజు విడుదల చేసినప్పటికీ ఏ మాత్రం కొంచెం తేడాగా టాక్ వస్తే బెడిసికొట్టే అవకాశం ఉంది. పుష్పమీద అంచనాలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఈ సినిమాను చూడటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే దీనిముందు ఇండియన్ 2 నిలబడే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడుతున్నారు. 🎥✨