top of page

ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా

ప్రముఖ సినీనటుడు రాజ్‌తరుణ్‌ – లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ప్రతిగా రాజ్ తరుణ్ కూడా ఆమెపై సంచలన ఆరోపణలు చేయడం, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను కూడా ఇందులోకి లాగడంతో ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. అతని తరఫున స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా రంగంలోకి దిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్ లో లావణ్య.. శేఖర్ బాషాపై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. శేఖర్‌ బాషాపై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు లావణ్య, ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ ఆస్పత్రి బెడ్ పై నుంచే ఒక వీడియోను రిలీజ్ చేశాడు శేఖర్ బాషా. ప్రస్తుతం ఈ వీడియ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


 
 
bottom of page