top of page
Suresh D

రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో కన్నడ స్టార్ హీరో..🎥🌟

రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గతంలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

'RRR' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గతంలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇది విషయాన్ని స్వయంగా శివ రాజ్ కుమార్ రివీల్ చేశారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు ప్రాజెక్టుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయని, ఈ సినిమాతో పాటు పలు తమిళ సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయని, అవి కూడా చర్చల దశలోనే ఉన్నాయని శివ రాజ్ కుమార్ తెలియజేశారు.

ధనుష్ హీరోగా నటించిన 'కెప్టెన్ మిల్లర్' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ రాజ్ కుమార్ ఈ విషయాలను పంచుకున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో శివ రాజ్ కుమార్ క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమా సక్సెస్ లో ఆయన రోల్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని విషయంతో 'RC16' పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

త్వరలోనే మూవీ టీం నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రాజ్ కుమార్ ఫ్యామిలీతో మెగాస్టార్ కి మంచి అనుబంధం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయన మెగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ లోటును రామ్ చరణ్ భర్తీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు వేసవిలో సెక్స్ పైకి వెళ్ళనుంది. ఏప్రిల్ నాటికి రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🎥🌟

bottom of page