అదొక పేరు మోసిన స్కూల్.. విద్యార్థులు ఎప్పటిలానే స్కూలుకు వెళ్లారు. మధ్యాహ్నం అయింది.. లంచ్ బ్రేక్ ఇచ్చారు. పిల్లలంతా సంతోషంతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లను ఓపెన్ చేసి.. క్లాస్ రూంలోనే భోజనం చేస్తున్నారు.. వాళ్ల మాటలు అరుపులతో సందడి నెలకొంది.. ఈ క్రమంలోనే.. హఠాత్తుగా క్లాస్ రూం గోడ కూలిపోయింది.. దీంతోపాటు.. పలువురు విద్యార్థులు కూడా కిందపడి శిథిలాల కింద చిక్కుకుని.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని వడోదరలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రెప్పపాటులో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ విద్యాలయ స్కూల్‌లోని నిన్న ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. లంచ్ బ్రేక్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో భోజనం చేస్తుండగా.. ఉన్నట్టుండి గోడ కూలింది.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. లంచ్ బ్రేక్ సమయంలో ఈ ఘటన జరిగింది. గోడ కూలడంతో విద్యార్థులకు సంబంధించిన సైకిళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు, తరగతి గదిలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగిందని.. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. సైకిల్ పార్క్ చేయడానికి వచ్చిన విద్యార్థిపై గోడ కూలిపోయిందన్నారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.. అధికారుల ప్రకారం.. పాఠశాల 2002-2003లో నిర్మించారు.. సమాచారం అందుకున్న వడోదర అగ్నిమాపక శాఖ బృందం పాఠశాలకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.