top of page
Shiva YT

🌟 బంగారం కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. 🌟

🌍 అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా బంగారం, ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం (ఫిబ్రవరి 23 2024) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది.


🏙️ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

🏦 ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,990, 24 క్యారెట్ల ధర రూ.63,220, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా కొనసాగుతోంది.

🌍 తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

🏙️ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.

bottom of page