పండుగ సమయంలో ఖర్చు ఎక్కువగా చేయాలని భావిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే కస్టమర్లు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే, భారీ ఆఫర్ అనే పేరుతో గుడ్డిగా కొనుగోలు చేయడం కూడా సరికాదని అంటున్నారు. సెలవుల సీజన్ లేదా పండుగ సీజన్‌లో ఇష్టారీతిన ఖర్చు చేసి ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దు. ఈ నేపథ్యంలో ఖర్చు చేయడానికి, ఖర్చు చేసే సమయంలో టిప్స్ తెలుసుకోండి.
షాపింగ్‌కు ముందు బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లకు మొగ్గుచూపడం కాస్తమంచిది. డిజిటల్ పేమెంట్స్‌ను ఉపయోగించాలి. అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. షాపింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఉపయోగపడే వస్తువుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. తోటివారు కొంటున్నారని, మనమూ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం సరికాదు. 🛒💳