top of page
Shiva YT

🛍️ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

🕐 సేల్ సమయంలో ధరలు: కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు వెయిట్ చేసి వృథానే. మీరు డైరెక్ట్‌గా సేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయాలి.

💰 డిస్కౌంట్లను నమ్మకూడదు: ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. ఈ డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి. అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు.

📉 ధరలు ట్రాక్ :మీరు ధరల్ని చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు దర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరల్ని ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.

🛒 విష్ లిస్ట్ : మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

🛍️ ఫ్లాష్ సేల్స్‌లో ఆర్డర్ : ముందుగానే ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఫ్లాష్ సేల్ సమయంలో ఆర్డర్ చేయాలి. ఇక మీరు కొనాలనుకునే వస్తువు ధర ఏ వెబ్‌సైట్‌లో ఎంత ఉందో చెక్ చేయాలి. కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. ఇంకొన్ని అమెజాన్‌లో దొరుకుతాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి.

🚫 వ్యసనం : ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న సూక్తిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

bottom of page