సినీ తారలు..అలాగే నటులు ఎక్కడికి వచ్చినా సరే సంతోషంగా.. సందడిగానే ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో అదే జరిగింది.
అనకాపల్లి జిల్లాలో ఈరోజు సినీ నటి అలాగే జబర్దస్త్ గత యాంకర్ అనసూయ సందడి చేశారు. ఒక షాపింగ్ మాల్ లో ఆమె వచ్చి సందడి చేశారు. షాపింగ్ మాల్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా వచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో లక్కీ షాపింగ్ మాల్ కి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు సినీ ఫేమస్ నటి అనసూయ. కాసేపు ఆమె చాలా సందడి చేశారు. ఆ తర్వాత విలేకరులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు.అనసూయ సంబంధించిన సినిమాలన్నిటికి సంబంధించి చాలా ప్రశ్నల్ని విలేకరులు అడిగారు. అయితే ఇవన్నీ కాదు లక్కీ షాపింగ్ మాల్ సంబంధించిన విషయాలు అడగండి అని చాలా వరకు ఆమె కోరారు. లక్కీ షాపింగ్ మాల్ లో చాలా రకాల మంచి శారీస్ ఉన్నాయని అలాగే అన్ని వర్గాలకు ఇక్కడ మంచి అందుబాటు ధరల్లో ప్రత్యేకమైన దుస్తులు ఉన్నాయని ఆమె చెప్పారు.