చాలా మంది బాలీవుడ్ స్టార్ హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్, దీపికా పదుకొనె , ప్రియాంక చోప్రా వంటి పలువురు హాలీవుడ్ లో సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రుతిహాసన్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే శ్రుతిహాసన్ ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్ తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది. ఇటీవలే సలార్ సినిమాతో సక్సెస్ అందుకుంది శ్రుతి. ఇక ఇప్పుడు ఈ చిన్నది హాలీవుడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిన్నది హాలీవుడ్ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.
హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ ‘చెన్నై స్టోరీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ హాలీవుడ్ చిత్రంలో సమంతా రూత్ ప్రభుని మొదట హీరోయిన్ గా ఎంపిక చేశారు. దర్శకుడితో సామ్ దిగిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి సమంత బయటకు వచ్చేసింది. ఆ తర్వాత శృతి హాసన్‌ని ఎంపిక చేశారు.
శృతి హాసన్ ‘చెన్నై స్టోరీ’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె ఎందుకు తప్పుకుందన్నది తెలియాల్సి ఉంది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక 2023లో ‘సలార్’ సినిమాతో శ్రుతిహాసన్ భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ సినిమాలో నటించింది. అలాగే హాలీవుడ్ సినిమా ‘చెన్నై స్టోరీ’ సినిమాకు కూడా సైన్ చేసింది. అయితే ఆ ప్రాజెక్ట్‌కి శ్రుతి గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై శ్రుతిహాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.