top of page
Shiva YT

అదరగొట్టిన శుభ్‌మన్ గిల్..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ అదరగొట్టాడు. గత మ్యాచుల్లో పెద్గగా ఆకట్టుకోని ఈ టీమిండియా ప్రిన్స్ సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ కేవలం 48 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 11 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 26 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 4 ఫోర్లు కొట్టాడు. సాయి సుదర్శన్ 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధికంగా కగిసో రబడా  2 వికెట్లు తీశాడు. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

bottom of page