top of page
MediaFx

సమ్మర్ వెకేషన్‌లో లవ్ బర్డ్స్.. ఇటలీలో సిద్ధార్థ్- అదితి.. ఫొటోస్ చూశారా?


రొమాంటిక్ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావు హైదరీ ఇటీవల సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. పెళ్లికి ముందే సమ్మర్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిపోయిన ఈ లవ్ బర్డ్స్, టస్కనీ అందాలను ఆస్వాదించారు.

📸 టస్కనీ అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన సిద్ధార్థ్‌, అదితి.. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ క్లోజ్‌గా దిగిన ఈ ఫొటోలు అభిమానులను అలరించాయి.

💞 వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌ అంటూ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. అలాగే పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

💒 గత మార్చిలో సిద్ధార్థ్‌, అదితి వనపర్తిలోని ఓ ప్రముఖ దేవాలయంలో చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా మంది మొదట ఈ వేడుకను పెళ్లి అనుకున్నారు.

వెంటనే తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన సిద్ధార్థ్‌, అదితి.. నిశ్చితార్థం చేసుకున్నామంటూ రింగ్‌లు తొడుక్కున్న ఫోటోలు షేర్‌ చేసి క్లారిటీ ఇచ్చారు.

bottom of page