top of page
Suresh D

ఎండాకాలంలో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..? ✨🥚

గుడ్డు.. ఆరోగ్యానికి వెరిగుడ్డు అంటారు.. గుడ్ల వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటి పోషకాలు గుడ్లల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే.. చాలా మంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు.

అయితే వేసవిలో గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా..? అనే ప్రశ్న చాలా మందికి తరచూ తలెత్తుతుంటుంది.. ఎందుకంటే.. గుడ్డు వేడి స్వభావాన్ని కలిగిఉంటుంది.. అందుకే.. వేసవిలో గుడ్లు తినాలా వద్దా..? అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.. అయితే, వేసవిలో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదో.. కాదో తెలుసుకోండి.

వేసవిలో గుడ్లను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు: వేసవిలో గుడ్లు అధికంగా తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే దాని అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. పరిమిత పరిమాణంలో తిసుకోవడం బెటర్ అంటున్నారు. 

కడుపు వేడి పెరగవచ్చు: వేసవిలో గుడ్లు తీసుకోవడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. ఎందుకంటే గుడ్డు స్వభావం వేడిగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ కూడా అనిపించవచ్చు. ✨🥚

జీర్ణ సమస్యలు: వేసవిలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 

మూత్రపిండాలపై చెడు ప్రభావం: వేసవిలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే.. మితంగా తింటే మంచిది అంటున్నారు. 

కొలెస్ట్రాల్: గుడ్లలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.


bottom of page