top of page
Suresh D

మీ పార్టనర్ ఇలా చేస్తే మరో ఎఫైర్ ఉన్నట్లేనట..

కొన్నిసార్లు మన పార్టనర్ మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా వేరేవారితో క్లోజ్‌గా ఉంటారు. ఇది మరీ విడాకుల వరకూ వచ్చేవరకూ తెలియదు. అలాంటప్పుడు ఏం చేసి సమస్య రాకుండా ముందునుంచి ఏం చేయొచ్చో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు ఎలాంటి ప్రవర్తిస్తారో తెలుసుకోండి. ఎఫైర్ పెట్టుకున్నప్పుడు ముందుగా పార్టనర్ చేసేది.. రిలేషన్‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం. మన పార్టనర్‌ని ముందుగా చూసినట్లుగా చూసుకోలేరు. వారు ఎంత బాగా ఉన్నా ఏ విషయంలో కూడా పట్టించుకోకపోవడం చేస్తారు. అదే విధంగా, ఎక్కువగా ఫోన్‌తోనే కాలాన్ని గడుపుతారు. చాట్ చేయడం, సోషల్ మీడియాలో ఉండడం ఇలాంటివన్నీ ఫోన్‌లోనే చేస్తూ బిజీగా ఉంటారు. అంతేకాకుండా ఫోన్‌ని కూడా ప్రైవసీగా పెడతారు. మొబైల్ లాక్ చేస్తారు. కాల్, బ్రౌజింగ్ హిస్టరీని డెలీట్ చేస్తారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకోరు. ఎప్పుడు ఒంటరిగా ఫోన్‌తో అలానే ఉండిపోతారు. ముక్కుసూటిగా ఏ విషయాన్ని చెప్పరు. అబద్ధాలు చెప్పడం కూడా చేస్తారు. ఏ విషయంలోనూ నిజాలు చెప్పడానికి ఇష్టపడరు. అదే విధంగా, హడావిడిగా ఉంటారు. అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోవడం, ఆలస్యంగా ఇంటికి రావడం, వీకెండ్స్, సెలవుల్లోనూ బిజీబిజీగా ఉండడం చేస్తారు.

bottom of page