top of page
Suresh D

సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ🎥✨

సిల్క్ స్మిత... ఈ పేరు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పాతిక సంవత్సరాలు దాటింది. అయినా సరే ఆమెను ఎవరూ మరువలేదు.

సిల్క్ స్మిత... ఈ పేరు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పాతిక సంవత్సరాలు దాటింది. అయినా సరే ఆమెను ఎవరూ మరువలేదు. పాటల్లో, ఏదో ఒక సినిమాలో సిల్క్ స్మిత ప్రస్తావన తప్పకుండా ఉంటోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆమె జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వి. మహాస్త్రి అమృతరాజ్ సమర్పణలో స్త్రీ సినిమాస్ పతాకంపై ఎస్.బి. విజయ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి జయరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'సిల్క్ స్మిత' టైటిల్ ఖరారు చేశారు. ది అన్ టోల్డ్ స్టోరీ... అనేది ఉప శీర్షిక. ఇవాళ సిల్క్ స్మిత జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 'సిల్క్ స్మిత' బయోపిక్ లో టైటిల్ పాత్రలో చంద్రికా రవి నటించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అంతే కాదు... స్మితగా చంద్రికా రవి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ లుక్ చూస్తే... అచ్చంగా సిల్క్ స్మిత దిగి వచ్చినట్లు ఉందని సోషల్ మీడియాలో కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 🎥✨

bottom of page