top of page
Shiva YT

💃🎬 దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్

🌟 హీరోయిన్‌గా రిటైర్ అయిన తర్వాత.. రీసెంట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిమ్రన్.. ఎట్ ప్రజెంట్ తన మూవీల విషయలో స్లో అండ్ స్టడీగా వెళుతున్నారు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసి.. ఆ రీల్తో ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్నారు ఆమె. సిమ్రాన్ వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఇప్పటికీ తన డ్యాన్స్‌తో అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్‌ను తన స్టైల్‌ ఆఫ్ స్టెప్పులతో రీ క్రియేట్ చేశారు ఈమె. అయితే సిమ్రన్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిమ్రాన్ డ్యాన్స్ అండ్ ఎనర్జీ చూసి… ఈమెకు సెల్యూట్ చేయాల్సిందే అనే కామెంట్ నెట్టింట వస్తోంది.

bottom of page