కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు నిర్మాత రాచాల యుగంధర్ ప్రారంభించిన డ్రీమ్ గేట్స్ బ్యానర్‌పై సుమన్ తేజ్, గరిమ చౌహాన్ నటించిన సీతా కళ్యాణ వైభోగమే జూన్ 21న విడుదలైంది. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కథ:
రామ్ (సుమన్ తేజ్) మరియు సీత (గరిమ చౌహాన్)లు ఊరి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. రామ్ తండ్రి మూర్తి (శివాజీ రాజా) క్యాన్సర్‌తో బాధపడుతూ చివరి కోరికగా సీతను ఆమె తండ్రి జానకి రామయ్య (నాగినీడు)తో కలిసేలా చేయమని కోరతాడు. రామ్, సీతలు మళ్లీ ఊరికి వెళ్లి, రమణ (గగన్ విహారి) అనే దుర్మార్గుడితో సమస్యలు ఎదుర్కొంటారు.
నటీనటులు:
సుమన్ తేజ్ మరియు గరిమ చౌహాన్ తెరకు కొత్తవారు అయినప్పటికీ, రొమాంటిక్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నారు. గగన్ విహారి విలన్‌గా తన పాత్రలో కఠినత్వాన్ని ప్రదర్శించాడు. నాగినీడు మరియు శివాజీ రాజా తమ పాత్రలను బాగా చేయగలిగారు. మిగిలిన పాత్రలు కూడా తగిన విధంగా నటించారు.
విశ్లేషణ:
ఈ చిత్రం రామాయణం విలువలను మరియు మరిచిపోతున్న మన సంస్కృతిని గుర్తు చేస్తూ, ఆవిష్కరించింది. ప్రస్తుత తరం ప్రేమను, తల్లిదండ్రులు ప్రేమను ఎలా చూస్తున్నారనే విషయాలను చూపించింది. పెళ్లి పట్ల ఉన్న అర్థాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేసింది. మొదటి భాగం సరదాగా సాగి, రెండో భాగం ఎమోషనల్‌గా సాగుతుంది.
టెక్నికల్‌గా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. విజువల్స్ సహజంగా ఉంటాయి, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు వినసొంపుగా ఉంటాయి. డైలాగ్స్ రాముడు, రామాయణం విలువలను వివరించేలా ఉంటాయి. రాచాల యుగంధర్ పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. డ్రీమ్ గేట్స్ బ్యానర్ మొదటి సినిమానే చక్కని విలువలతో కూడిన సినిమా నిర్మించి మెప్పించింది.