top of page
Suresh D

'ఆదికేశవ' నుంచి 'సిత్రాల సిత్రావతి' లిరికల్ సాంగ్ రిలీజ్..🎥🎞️

వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఆదికేశవ' సినిమా నిర్మితమైంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యం ... దేవాలయం నేపథ్యంతో ముడిపడిన కథ ఇది. వైష్ణవ్ తేజ్ కెరియర్లో ఫస్టు టైమ్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కంటెంటు ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'సిత్రాల సిత్రావతి .. ఉన్నపాటున పోయేమతి, సూపులో పచ్చ జెండా ఎత్తి .. నన్ను చేసినవే ఛత్రపతి" అంటూ ఈ పాట సాగుతోంది. వైష్ణవ్ - శ్రీలీలపై ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో కలర్ఫుల్ గా చిత్రీకరించారు.🎥🎞️



bottom of page