శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు. 100 కోట్ల బడ్జెట్ తో 2016లో అయలాన్ సినిమాను అనౌన్స్ చేశారు.
శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు. 100 కోట్ల బడ్జెట్ తో 2016లో అయలాన్ సినిమాను అనౌన్స్ చేశారు. 2018 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్, వీఎఎఫ్ఎక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడం, బడ్జెట్ పెరిగిపోవడంతో అయలాన్ రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఈ మూవీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 🎥🍿
కాగా అయలాన్ మూవీ కోసం శివకార్తికేయన్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో సినిమా యూనిట్ స్వయంగా వెల్లడించింది. అయలాన్ కథ శివకార్తికేయన్‌కు చాలా నచ్చిందని, దర్శకుడి విజన్, సినిమా కోసం యూనిట్ పడుతోన్న కష్టం ప్రేక్షకులకు చేరువ కావాలనే అతడు ఉచితంగా అయలాన్‌లో నటించినట్లు యూనిట్ తెలిపింది. ప్రస్తుతం శివకార్తికేయన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో తమిళంలో దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయలాన్ కోసం శివకార్తికేయన్ భారీ రెమ్యునరేషన్‌ను వదులుకోవడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. 💰🎤