రామ్ - బోయపాటి కాంబినేషన్లో 'స్కంద' సినిమా రూపొందింది. 😎 శ్రీనివాస చుట్టూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 💰
శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. 🎬 ఈ నేపథ్యంలో 'కరీంనగర్' వేదికగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 📽️ ఈ స్టేజ్ పై రామ్ మాట్లాడుతూ .. బోయపాటి సినిమాల్లో భారీ యాక్షన్ తో పాటు, అందుకు కారణమైన బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని అన్నాడు. ఇది మాస్ సినిమానే అయినా .. కేవలం మాస్ అంశాలు మాత్రమే ఉండవని చెప్పాడు. ఈ సినిమా ద్వారా బోయపాటి ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నాడు. 📱 ఇక బోయపాటి మాట్లాడుతూ .. తాను చాలా కూల్ గా కనపడుతున్నానని అంటున్నారనీ, నిజంగానే తనకి ఎలాంటి టెన్షన్ లేదని చెప్పాడు. సినిమా తీసేటప్పుడు మాత్రమే తాను టెన్షన్ పడతాననీ, అవుట్ పుట్ వచ్చిన తరువాత అసలు టెన్షన్ ఉండదని అన్నాడు. 🤗 అందుకు కారణం తాను బాగా సినిమా తీశాననే నమ్మకం తనకి ఉండటమేనని చెప్పాడు