రియల్‌మీ కంపెనీ మిడ్-రేంజ్ నంబర్ సిరీస్ ఫోన్లు జూలై 30న భారతదేశంలో ప్రారంభించింది. రియల్ మీ 13 సిరీస్ ఫోన్లను కేవలం మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసింది. రియల్ మీ 13 ఫోన్లు ప్రో, ప్రో ప్లస్ వేరియంట్స్‌లో రిలీజ్ చేసింది. అయితే రేట్ గురించి ప్రత్యేకంగా కంపెనీ పేర్కొనకపోయినప్పటికీ ఈ ఫోన్లు రూ.26 వేల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కూడా తన వీ 40 సిరీస్‌ను ఈ నెలలోనే లాంచ్ చేయనుంది. ఈ నెల ఏడో తారీఖున వివో వీ 40, వీ 40 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రియులను అలరించనున్నాయి. ఈ ఫోన్ 'ప్రో' వెర్షన్‌లో జూమ్-ఇన్ పోర్ట్రెయిట్లను అందించడానికి 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. ఐపీ 68 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ స్టార్టింగ్ ధర రూ.40 వేల నుంచి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న భారతదేశంలో లాంచ్ చేయనుంది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్టెల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కూడా ఉంటాయని చెబుతున్నారు. టెన్సర్ జి4 చిప్ సెట్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. ఏఐ ఫీచర్లతో వచ్చే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధర గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
ఐక్యూ జెడ్9 ఎస్ సిరీస్ ఫోన్లను ఆగస్టు 4న అంటే ఈ రోజే ప్రకటించనున్నారు. ఐక్యూ జెడ్ 9 ఎస్, ఐక్యూ జెడ్ 9 ఎస్ ప్రో ఫోన్లు కర్వ్‌డ్ డిస్ ప్లేతో వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్ సెట్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 20 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటాయని చెబుతున్నారు.
నథింగ్ ఫోన్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 2ఏ ఫోన్‌ను జూలై 31న రిలీజ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 7350 చిప్ సెట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫొటో ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.30 వేల కంటే తక్కువకే వస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.