top of page
MediaFx

పామును మింగిన కోబ్రా..వీడియో చూస్తే షాక్ అయిపోతారు..


కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి అరుదైన వైట్ కలర్ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు వీడియోలో కనిపించే వ్యక్తి. కింగ్ కోబ్రాను ఓ గ్లాజు బాక్స్‌లో ఉంచాడు. ఒక సైడ్ డోర్ తీసి.. అందులోకి మరో పామును ఉంచాడు. ఆ సన్నని పామును డ్రాయర్‌లో ఉంచగానే కింగ్ కోబ్రా.. వెంటనే తన నోటితో పట్టుకుంది. తర్వాత ఆ వ్యక్తి తన చేతి వేళ్లతో పాము తల మీద నిమిరాడు. ఆ తర్వాత 3 అనే నెంబర్స్ చూపిస్తూ డోర్ క్లోజ్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న పామును ఆ కోబ్రాకు ఆహారంగా ఇస్తున్నట్లు ఉంది. అంతే ఇక్కడితో ఆ వీడియో పూర్తి అవుతుంది. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆతృతగా స్పందిస్తున్నారు. ఆ పాము ఉందా? లేక చనిపోయిందా? కోబ్రా ఆ పామును తినేసిందా.. ఆ పాము ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా తినేస్తుందని అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం రచ్చ లేపుతోంది.



bottom of page