top of page
MediaFx

సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ ఇంటిని కొన్న ఆదా శర్మ..

గతకొంత కాలంగా నిత్యం ఏదోక వార్తలలో నిలుస్తుంది హీరోయిన్ ఆదాశర్మ. అప్పటివరకు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ హీరోయిన్.. ఉన్నట్లుండి సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది. అందుకు కారణం ది కేరళ స్టోరీ. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది ఆదా శర్మ.

ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. కానీ రిలీజ్ అయ్యాక ఆదా నటనపై ప్రశంసలు కురిపించారు సినీ విమర్శకులు. ఈ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బస్తర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. ఇదిలా ఉంటే.. కొన్ని నెలల క్రితం ఆదాశర్మ.. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివసించిన ఇంటిని కొనుగోలు చేస్తుందని వార్తలు వినిపించాయి. అదే సమయంలో సుశాంత్ ఇంటి నుంచి ఆదా బయటకు రావడం కనిపించింది. దీంతో నిజంగానే ఆమె సుశాంత్ ఇంటిని కొనుగోలు చేసిందని.. త్వరలోనే ఆ ఇంటికి షిఫ్ట్ కాబోతున్నట్లు టాక్ నడిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ పై మౌనం వీడింది ఆదాశర్మ.

సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదా శర్మ మాట్లాడుతూ.. “ప్రస్తుతానికి నేను ప్రజల హృదయాల్లో నివసిస్తున్నాను. అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మాట్లాడానికి ఒక సరైన సమయం ఉంటుంది. నేను ఆ ఇల్లు చూడటానికి వెళ్లినప్పుడు అందరి దృష్టి నాపైనే ఉంది. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. నా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తిని కాదు. కేవలం నా సినిమాలకు సంబంధించిన వార్తలు మాత్రమే మీడియాకు చెప్పాలనుకుంటున్నాను. ఇతర విషయాల్లో ప్రైవసీ మెయింటెయిన్ చేయడానికే ఇష్టపడతాను. ఈ లోకంలో లేని వ్యక్తి గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అతడు డ్రగ్స్ తీసుకున్నాడని అంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం తప్పు. ఆయనంటే చాలా గౌరవం. నన్ను ట్రోల్ చేయండి కానీ, లోకంలో లేని వ్యక్తి గురించి మాట్లాడవద్దు” అని అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న ఆ ఇల్లు 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2022లో ఈ ఇంటి అమ్మకం గురించి వార్తలు వచ్చాయి. అతను జూన్ 14, 2020న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత ఆ ప్లాట్ ఖాళీగానే ఉంటుంది. సుశాంత్ ఆ ఇంటికి నెలకు రూ. 4.5 లక్షల అద్దె చెల్లించేవారని సమాచారం.

bottom of page