top of page
Suresh D

ప్ర‌ముఖ యూ ట్యూబర్ కన్నుమూత.. దేశవ్యాప్తంగా విషాదంలో సోషల్ మీడియా🎬

యాంగ్రీ రాంట్‌మన్‌గా నెట్టింట ఫేమ్ ని సంపాదించుకున్న యూట్యూబర్ ‘అబ్రదీప్ సాహా’. క్రికెట్, ఫుట్‌బాల్ మరియు ఇతర క్రీడలతో పాటు సినిమాల పై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.సౌత్ ఇండస్ట్రీ మూవీస్ గురించి బాలీవుడ్ లో సానుకూలంగా రివ్యూస్ ఇచ్చేవాడు ఈ యూట్యూబర్ గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట.కొన్ని నెలలు క్రితం తీవ్రమైన అనారోగ్యంతో బెంగళూరులోని నారాయణ కార్డియాక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి అక్కడ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో నెలరోజుల పాటు సోషల్ మీడియాలో సాహా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడు. ఈ చికిత్స గురించి సాహా తండ్రి సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కి తెలియజేసాడు. త్వరలోనే తన కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పుకొచ్చాడు. కానీ వారం రోజుల క్రితం సాహా మళ్ళీ తీవ్రమైన అనారోగ్యానికి గురవ్వడంతో.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేషన్ మీద ఉంచారు. ఇక రెండు రోజుల క్రితం చికిత్సకు స్పందించడం మానేసిన సాహా..గత రాత్రి మరణించాడంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజ్4ఎస్ఎస్ఆర్ అనే నెటిజన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 27 ఏళ్ల వయసులో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించినట్లు సమాచారం. అతి చిన్న వయసులోనే సాహా తుది శ్వాస విడవడంతో నెటిజెన్స్ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.కాగా అబ్రదీప్ సాహా తన వైవిధ్యమైన వ్యాఖ్యాన శైలితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకున్నాడు. అతని యూట్యూబ్‌ ఛానెల్ ‘యాంగ్రీ రాంట్‌మాన్’కి 481K పైగా సబ్‌స్క్రైబర్లు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 119K ఫాలోవర్లు ఉన్నారు.🎬


bottom of page