top of page
Shiva YT

📽️ ‘ప్లీజ్‌ నా సినిమా చూడండి’ వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.

💔 బుల్లితెరపై సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర్యయాడు సోహైల్. ఆ తర్వాత బిగ్‎బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ అయిన సోహైల్.. ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించిన సోహైల్.. ఇప్పుడు మరో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అదే బూట్ కట్ బాలరాజు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్‌కు వచ్చిన సోహైల్. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. థియేటర్లో.. అందరి ముందే ఏడ్చాడు. బూట్ కట్ బాల రాజు సినిమాను ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సోహైల్‌… ఇందులో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. డైరెక్టర్ శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘలేఖ కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా.. థియేటర్లలో మాత్రం అసలు జనాలు కనిపించడం లేదు. పలు థియేటర్లలో షోలు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా రూపొందించామని.. ఫ్యామిలీ అడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని.. అయినా జనాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


bottom of page