top of page
MediaFx

కొడుకు ఫేస్ రివీల్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్..


తెలుగు సినీ పరిశ్రమలో ఫేమస్ సింగర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ఆమె పాటలు శ్రోతల మనసులను మెస్మరైజ్ చేస్తుంటాయి. ఇన్నాళ్లు సినిమాల్లో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించిన ఆమె.. ఇప్పుడు ఓ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. తాజాగా తన కొడుకు ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోస్ షేర్ చేసింది. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నోడు టాలీవుడ్ సింగర్ తనయుడు. ఆ గాయని మరెవరో కాదు.. సింగర్ గీతామాధురి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని చిత్రాల్లో పాటలు పాడి ముగ్దులను చేసిన గీతామాధురి.. తాజాగా తన కొడుకు ఫోటోషూట్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ బాబు క్యూట్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సింగర్ గీతా మాధురి 2014లో టాలీవుడ్ నటుడు నందును ప్రేమ వివాహం చేసుకోగా.. 2019లో వీరికి పాప దాక్షాయణి ప్రకృతి జన్మించింది. ఇటీవల ఫిబ్రవరి 10న గీతామాధురి, నందు జంటకు బాబు జన్మించగా.. ధృవధీర్ తారక్ అని పేరు పెట్టారు. బాబు బారసాలకు సంబంధించిన వీడియో మాత్రమే షేర్ చేయగా.. ఫేస్ చూపించకుండా జాగ్రత్తగా తీసుకున్నారు. తాజగా బాబు జన్మించి ఆరు నెలలు కావడంతో ఓ స్పెషల్ ఫోటోషూట్ చేసి బాబు ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నందు బుల్లితెరపై ఢీ డాన్స్ షోకు హోస్టింగ్ చేస్తుండగా.. గీతా మాధురి తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జీగా వ్యవహరిస్తుంది.


Related Posts

See All
bottom of page